మనిషి బ్రతుకు రంగుల వలయం Song Lyrics

మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి||

గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును (2)
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||

ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||

ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా (2)
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||

మనిషి బ్రతుకు రంగుల వలయం telugu christian video song


మనిషి బ్రతుకు రంగుల వలయం Song Lyrics