నా దేవ ప్రభువా Song Lyrics

నా దేవ ప్రభువా నీ చెంతను
సదా వసింపను నా కిష్టము
ఏవైనా శ్రమలు తటస్థమైనను
నీ చెంత నుందును నా ప్రభువా

ప్రయాణకుండను నడవిలో
నా త్రోవ జీకటి కమ్మినను
నిద్రించుచుండగా స్వప్నంబునందున
నీ చెంత నుందును నా ప్రభువా

యాకోబు రీతిగా ఆ మెట్లను
స్వర్గంబు జేరను జూడనిమ్ము
నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా
నీ చెంత నుందును నా ప్రభువా

నే నిద్రలేవగా నా తండ్రి నే
నీకుం గృతజ్ఞత జెల్లింతును
నే చావునొందగా ఇదే నా కోరిక
నీ చెంత నుందును నా ప్రభువా

నా దేవ ప్రభువా telugu christian video song


నా దేవ ప్రభువా Song Lyrics