నా కొరకు బలియైన Song Lyrics

నా కొరకు బలియైన ప్రేమ
బహు శ్రమలు భరియించె ప్రేమ (2)
కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2)
తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2)
క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు||

నా హృదయ యోచనే జరిగించె పాపము
నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2)
ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా
నా ఘోర పాపముకై మరణించినావయ్యా
ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2)
నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు||

నీ సిలువ త్యాగము నా రక్షణాధారం
నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2)
అర్హతే లేని నాకై మరణించినావయ్యా
నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా
ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా
ఘనపరతు యేసయ్యా (2) ||నా కొరకు||

నా కొరకు బలియైన telugu christian video song


నా కొరకు బలియైన Song Lyrics