నా తండ్రి Song Lyrics

నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని –దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం –శోకమునే చూపించింది ||లోకం||

నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించినా ప్రేమా – ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని –తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే –నీ ప్రేమా ఎంతో చూపితివె ||నా తండ్రి||

నా తండ్రి telugu christian video song


నా తండ్రి Song Lyrics