నా తనువు నా మనసు
నా నైపుణ్యం నీ కొరకే
నా తలంపులు నా మాటలు
నా క్రియలు నీ కొరకే
నా ప్రయాసే కాదు
నీ కరుణతో నిలిచింది ఈ జీవితం
నీ నామం కీర్తించాలని
నీ బలం చూపించాలని
అందుకేగా నన్నిలలో నియమించితివి
నీ స్వరూపముగా
నీ శ్వాసతో నను సృజియించితివి
నీ మహిమగా నేనుండుటకు
నీతోనే జీవించుటకు (2)
అందుకేగా నన్నిలలో సృజియించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||
గర్భ వాసమున లేనప్పుడే
నన్ను ప్రతిష్టించితివి
నీ వెలుగునే ప్రకాశించుటకు
నీ ప్రేమనే పంచుటకు (2)
అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి
అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు||