నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2)
నాకెంతో ఆనందం…
ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక (2)
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా (2) ||నాకెంతో||
నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని (2)
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా (2) ||నాకెంతో||
నూతన యెరూషలేం నా గమ్యమేనని
నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా (2)
నీవుండు స్థలములో నేనుండ గోరెదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా (2) ||నాకెంతో||