నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song Lyrics

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్
నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్
నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ
నీ ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)

శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా
కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)

జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా
ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||

నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ telugu christian video song


నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song Lyrics