నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా (2)
తడిసెదను.. నీ జీవనదిలో (2)
తడిసి తడిసి ఆనందించెదా (2) ||నీ ఆనంద||
వీడిపోయెను నా పాప సంకెళ్లు
నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు (2)
దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ (2)
నే మరువగలనా నీ మంచి ప్రేమ (2) ||నీ ఆనంద||
నీ ఆత్మ నాకు తోడుండగా
కానెన్నడు కాను ఒంటరిని (2)
ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన (2)
నే మరువగలనా నా హృదయములో (2) ||నీ ఆనంద||
నే దాటిపోదును దేశ సరిహద్దులు
ప్రకాశించెద చీకటి లోకంలో (2)
జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా (2)
నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో (2) ||నీ ఆనంద||