నీ జ్ఞాపకం అనేకులను – ప్రభు వైపుకు త్రిప్పుచుండెనా
నీ జ్ఞాపకం ఆత్మీయులకు – క్షేమాభివృద్ధి నిచ్చుఁచుండెనా (2)
నీ జ్ఞాపకం నీవు మరణించినా
మరణాంతర పరిచర్య చేయునా (2)
మరణాంతర పరిచర్య చేయునా ||నీ జ్ఞాపకం||
పేతురన్న జ్ఞాపకం – పశ్చాత్తాప పరిమళం
పౌలన్న జ్ఞాపకం – పోరాటపు ప్రోత్సాహం (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
బర్నబాన్న జ్ఞాపకం – ఆదరణానందము
తిమోతన్న జ్ఞాపకం – విశ్వాస విజయము (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||
ఫిలిప్పన్న జ్ఞాపకం – సువార్త సునాదము
స్తెఫనన్న జ్ఞాపకం – క్రీస్తుని స్వారూప్యము (2)
నేటికీ స్మరణకు తెచ్చుచుండెగా
క్షేమాభివృద్ధి కలిగించుచుండెగా (2) ||నీ జ్ఞాపకం||