నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం) Song Lyrics

నీ జీవితం క్షణ భంగురం
నీ యవ్వనం తృణాప్రాయం
ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు
ఎప్పుడు పోవునో నీకు తెలియదు
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరా
ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా
పరిహాసమేల ఓ సోదరీ
పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ…

ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి
విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2)
ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2)
ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం||

నీకున్నవన్నియు క్షణిక సుఖములే
ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2)
ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2)
ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం||

నీ జీవితం క్షణ భంగురం (నీ యవ్వనం) telugu christian video song