నీ కృప చాలును Song Lyrics

నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)
నీవు లేని జీవితం అంధకార బంధురం (2)
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో (2)
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా (2)
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ (2)
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా (2)

నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా (2)

నీ కృప చాలును telugu christian video song


నీ కృప చాలును Song Lyrics