నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
అది నిర్దేశించును జీవిత గమ్యమును
ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం||
లోకం దాని ఆశలు గతించిపోవును
మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం||
పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||