నీ రక్త ధారలే –మా జీవనాధారాము
నీ సిల్వ మార్గమే –మా మోక్ష భాగ్యము
ఓ సిల్వ రాజ – క్రీస్తు రాజ
నీతి రాజ – యేసు రాజ (2)
మాలోన పలికించు జీవన రాగము – నీ ఆర్తనాదములే
మాలోన వెలిగించు జీవన జ్యోతులు – నీ సిల్వ రూపమే ||ఓ సిల్వ||
మమ్మును నడిపించు పరలోకమునకు – నీ సత్య వాక్యమే
పాపపు చీకట్లు పారద్రోలెను – నీ నీతి ప్రభావమే ||ఓ సిల్వ||
నీ సిలువ మరణము మనుజాళికంత – కలిగించె రక్షణ
నీ మరణ విజయము జగమందు వెలుగొందు – క్రైస్తవ విజయమై ||ఓ సిల్వ||