నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||