నీవే ఆశ నీవే శ్వాస Song Lyrics

నీవే ఆశ నీవే శ్వాస
నీవే ధ్యాస యేసువా
నీవే ప్రాణం నీవే గానం
నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే||

ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్ధమాయే
ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే ||నీవే||

హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే
దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచి
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే ||నీవే||

నీవే ఆశ నీవే శ్వాస telugu christian video song


నీవే ఆశ నీవే శ్వాస Song Lyrics