నీవే నా సర్వము Song Lyrics

నీవే నా సర్వము నీవే నాకున్నావు
నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో (2)

తేనె కంటే మధురము (2)
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె||

నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము
నీ పాదములకు మ్రొక్కెదను
నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె||

నీవే పరిహార నీవే పరమౌషధం
నీవే నా శక్తివి నా యేసయ్యా
కల్వరి సిలువపై బాలి అయితివే
నే బాగుపడితిని గాయములచే (2) ||తేనె||

నీవే నా కీర్తివి నీవే నా అతిశయం
నీవే నా మేలులు నా యేసయ్యా
నీ పాద సేవయే చేయుటయే
నా హృదయములున్న వాంఛయేగా (2) ||తేనె||

నీవే నా సర్వము telugu christian video song


నీవే నా సర్వము Song Lyrics