నీవు లేనిదే నేను లేను Song Lyrics

నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు||

గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం (2) ||నీవు||

అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2)
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2)
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం (2) ||నీవు||

నీవు లేనిదే నేను లేను telugu christian video song


నీవు లేనిదే నేను లేను Song Lyrics