నీవు తోడుండగా Song Lyrics

నీవు తోడుండగా నాకు దిగులుండునా
నా మంచి యేసయ్యా
మనసారా స్తోత్రమయా(2) ||నీవు తోడుండగా||

నీవంటి వారెవ్వరు
నీ తోటి సాటెవ్వరు (2)
నా జీవితాన – నీవే ప్రభువా (2)
నాకెవ్వరు లేరు ఇలలో (2)
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా
నీవు తోడుండగా….

మనుషులలో మహనీయుడా
వేల్పులలో ఘణ పూజ్యుడా (2)
సర్వాధికారి సర్వాంతర్యామి (2)
చేసెద నీ పాద సేవ (2)
హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)
హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||

నీవు తోడుండగా telugu christian video song


నీవు తోడుండగా Song Lyrics