నెమ్మది లేదా Song Lyrics

నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా
చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా
ఆశలు ఆవిరై పోయినా
నీ కలలన్ని చెదరిన
అలసిపోక సాగిపోవుమా (2) ||నెమ్మది||

నీ వారు నిన్ను హేళన చేసినా
నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ
గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ
అవమానం నింద కలచి వేస్తున్నా
నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును
నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును
నీ కోసమే తను నిలిచెను
నీ బాధను తొలగించును ||నెమ్మది||

నీ కన్నీరంతా తుడిచి వేయును
నీ గాయాన్నంతా మాన్పి వేయును
విలువైన పాత్రగ నిన్ను మార్చును
నీ వారికే నిన్ను దీవెనగా చేయును
కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును
నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును
తన ప్రేమకు నువ్వు సాక్షిగా
జీవించుమా ఇల నిత్యము

నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు
చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం

నెమ్మది లేదా telugu christian video song


నెమ్మది లేదా Song Lyrics