నేనునూ నా ఇంటి వారును Song Lyrics

నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ||

శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ||

ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ||

దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||

నేనునూ నా ఇంటి వారును telugu christian video song