నిబ్బరముతో నా యేసుకే Song Lyrics

నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా(2)
యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా
యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో||

కష్టకాలమందు నాకు – కనికరము చూపెను
కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)
కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను
కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను
కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా||

దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను
ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)
దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను
దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను
దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా||

నిబ్బరముతో నా యేసుకే telugu christian video song


నిబ్బరముతో నా యేసుకే Song Lyrics