నింగిలో దేవుడు Song Lyrics

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో||

పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో||

సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో||

నింగిలో దేవుడు telugu christian video song


నింగిలో దేవుడు Song Lyrics