చీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా (2)
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన (2)
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా
కనికరమే లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా (2)
నీ ప్రేమతో నను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన (2) ||నన్ను నీవు||
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా (2)