నిరంతరమైన నీ కృపలో Song Lyrics

నిరంతరమైన నీ కృపలో
నే పొందుచున్న ఆనందమే అది
అవధులు లేని ఆనందమే అది
శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన||

అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు
అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2)
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన||

బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు
బలమైన కార్యములను బహుగా చేయించినావు (2)
నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే
నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన||

మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా
మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన||

నిరంతరమైన నీ కృపలో telugu christian video song


నిరంతరమైన నీ కృపలో Song Lyrics