ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము
ఒకే పరిహారము
లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2)
విడువుము నీ మార్గం ||ఒకే ఒక||
లోకం మాయరా – పాపం వీడరా (2)
నీ హృదయమెంతో బలహీనమంతా
పెడ దారి చూపురా (2)
పరికించి చూడుమా ||ఒకే ఒక||
రక్తం చిందెరా – సిలువలో చూడరా (2)
నీ పాపములకు ప్రభు యేసు రక్తం
పరిహారమాయెరా (2)
క్షమ భిక్ష వేడరా ||ఒకే ఒక||
సమయం లేదురా – సత్యమే సోదరా (2)
రారాజు త్వరలో రాబోవుచుండె
రక్షణను కోరుమా (2)
రయముగను చేరుమా ||ఒకే ఒక||