ఒక్కడే యేసు ఒక్కడే Song Lyrics

ఒక్కడే యేసు ఒక్కడే
ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)
మహాదేవుడు మహిమోన్నతుడు
లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే
పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)
జీవమార్గమై సత్యదైవమై
మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే
అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)
ఆదరించి ఆశ్రయమిచ్చి
అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడే
నిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)
నీ వేదనలో నీ బాధలలో
నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే
మరల రానున్నవాడు యేసు ఒక్కడే (2)
పరిశుద్దులను ఆ పరమునకు
కొనిపోవువాడు యేసు ఒక్కడే (2) ||ఒక్కడే||

ఒక్కడే యేసు ఒక్కడే telugu christian video song


ఒక్కడే యేసు ఒక్కడే Song Lyrics