ఒంటరివి కావు Song Lyrics

ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా (2) ||ఒంటరివి||

వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||

బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా (2)
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||

ఒంటరివి కావు telugu christian video song


ఒంటరివి కావు Song Lyrics