పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)
తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే ||పావురమా||
అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా||
బలహీనతలో బలమా బహుమానములో మహిమా(2)
వెలిగే వరమా ఓ పావురమా(2)
దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||