పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)
బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో||
స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో||
మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో||
సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||