పరిశుద్ధుడా పరిశుద్ధుడా
నీ సన్నిధిలో మోకరించెదా
ప్రాణాత్మతో శరీరముతో
జయమని పాడెదా
హోసన్నా జయమే – (8)
గొర్రెపిల్లా గొర్రెపిల్లా
నీవంటి వారు ఎవరున్నారయ్యా
లోక పాపం మోసుకున్న
దావీదు తనయుడా
హోసన్నా జయమే – (8)
ప్రతి రోజు ప్రతి నిమిషము
జయమని పాడెదా – (2)
ప్రతి చోట ప్రతి స్థలములో
జయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా||