పొర్లి పొర్లి పారుతుంది Song Lyrics

పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును (2)
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును (2)
చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||

రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు (2)
ఆ ముక్తిదాత రక్తమందే
జీవము గలదు (2)
గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి||

విశ్వ పాపములను మోసే యాగ పశువదే
యాగ పశువదే.. యాగ పశువదే (2)
కోసి చీల్చి నదియై పారే
యేసు రక్తము (2)
రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి||

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)
రమ్ము రమ్ము ఉచితము
ఈ ముక్తి మోక్షము (2)
మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి||

పొర్లి పొర్లి పారుతుంది telugu christian video song


పొర్లి పొర్లి పారుతుంది Song Lyrics