ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన||
కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు ||ప్రార్ధన||
ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన||
సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||