ప్రార్ధన యేసుని సందర్శన
పరమ తండ్రితో సంభాషణ
కరములెత్తి ప్రార్ధించగా
పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా
మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన||
తండ్రి అని నే పిలువగా
తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా
కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన||
మోకరించి ప్రార్ధించగా
సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును
మహిమతో నలంకారించును ||ప్రార్ధన||
కుటుంబముతో ప్రార్ధించగా
కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును
శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన||
సంఘముగను ప్రార్ధించగా
కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును
ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన||
ఉపవాసముతో ప్రార్ధించగా
కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును
క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన||
ఏకాంతముగా ప్రార్ధించగా
నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును
యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||