ప్రార్థించుము Song Lyrics

ప్రార్థించుము నీ జీవితములో
నెమ్మది సుఖము లొందెదవు (2)
సంపూర్ణ భక్తిని కలిగించును
క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము||

యెడతెగక నీవు ప్రార్థించినా
విసుగక నీవు ప్రార్థించినా (2)
సమస్తమును నీవు పొందెదవు
తప్పక న్యాయము పొందెదవు (2)
నీ కొరకై ప్రభు వేచియున్నాడు
ప్రార్థనలో కనిపెట్టుము (2) ||ప్రార్థించుము||

కష్టము నష్టము కలిగినను
శోధన బాధలు వచ్చినను (2)
సాతాను నీపై విజృంభించి
నిన్ను గాయపరచినను (2)
భయపడకుము ప్రభువే నీకు
జయము నిచ్చును (2) ||ప్రార్థించుము||

ప్రభువే మనతో సెలవిచ్చెను
మెళకువగా నుండి ప్రార్థించుమని (2)
విశ్వాసము కోల్పోయే దినములలో
విశ్వాసముతో ప్రార్థించినా (2)
సాతాను దుర్గములను పడగొట్టి
బలము పొందెదవు (2) ||ప్రార్థించుము||

ప్రభువచ్చు వేళాయే గమనించుము
ఆత్మ వలన ప్రతి విషయములో (2)
ప్రార్థన విజ్ఞాపన చేయుచు
పూర్ణమైన పట్టుదలతో (2)
పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు
మెళకువగా నుండుడి (2) ||ప్రార్థించుము||

యెరూషలేము క్షేమముకై
అన్యజనుల రక్షణకై (2)
భారముతో నీవు ప్రార్థించిన
ప్రభువే నీకు ఫలమిచ్చును (2)
వారి క్షేమమే నీ క్షేమమునకు
ఆధారమగును (2) ||ప్రార్థించుము||

ప్రార్థించుము telugu christian video song


ప్రార్థించుము Song Lyrics