ప్రభు సన్నిధిలో ఆనందమే Song Lyrics

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం
ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2) ||ప్రభు||

ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) ||ప్రభు||

దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి (2) ||ప్రభు||

ప్రభు సన్నిధిలో ఆనందమే telugu christian video song


ప్రభు సన్నిధిలో ఆనందమే Song Lyrics