ప్రభువా నీ పరిపూర్ణత నుండి Song Lyrics

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా||

జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||

నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||

దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||

మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||

ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||

కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||

ప్రభువా నీ పరిపూర్ణత నుండి telugu christian video song