ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2)
ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||
వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||
నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||