ప్రియ యేసు నాథ Song Lyrics

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు
నీదు పొలములో కూలివానిగా
కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే
అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే

స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను
మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2)
మరువకు నా ప్రాణమా
నీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు||

ఏక భావము సేవ భారము
యేసు మనసుతో సాగిపోదును (2)
విసుగక విడువక
కష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు||

ప్రియ యేసు నాథ telugu christian video song


ప్రియ యేసు నాథ Song Lyrics