సాగిలపడి మ్రొక్కెదము Song Lyrics

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి||

మోషేకంటే శ్రేష్టుడు
అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులను ద్వేషించున్
ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

అహరోనుకంటే శ్రేష్టుడు
మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు
అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

ఆలయముకన్న శ్రేష్టుడు
నిజ ఆలయముగ తానే యుండెన్ (2)
ఆలయము మీరేయనెను
ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

యోనా కంటె శ్రేష్టుడు
ప్రాణ దానముగా తన్ను అర్పించెన్(2)
మానవులను విమోచించెన్
ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

సొలోమోను కన్న శ్రేష్ఠుడు
సర్వజ్ఞానమునకు ఆధారుండు (2)
పదివేలలో అతిప్రియుండు
పదిలముగ మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

రాజులకంటే శ్రేష్ఠుడు
యాజకులనుగా మనలను చేసెన్ (2)
రారాజుగ త్వరలో వచ్చున్
రయముగను మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

అందరిలో అతి శ్రేష్ఠుడు
మనకందరికి తానే ప్రభువు (2)
హల్లెలూయకు పాత్రుండు
అనుదినము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

సాగిలపడి మ్రొక్కెదము telugu christian video song


సాగిలపడి మ్రొక్కెదము Song Lyrics