సామాన్యుడవు కావు Song Lyrics

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు (2)

ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది (2)
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్||

జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు (2)
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హ్యాప్పీ క్రిస్మస్||

యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2)
నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హ్యాప్పీ క్రిస్మస్||

సామాన్యుడవు కావు telugu christian video song