SAAMETHALU CHAPTER 13 | TODAY'S SCRIPTURE | సామెతలు 13 | TELUGU AUDIO BIBLE


SAAMETHALU CHAPTER 13 | TODAY'S SCRIPTURE | సామెతలు 13 | TELUGU AUDIO BIBLE

Heaven and Earth will pass away but my Words will never pass away says the Lord.
Matthew 24:35.
సామెతలు 13
1తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును.
అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
2నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును
విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.
3తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును
ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు
దొరకదు
శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
5నీతిమంతునికి కల్ల మాట అసహ్యము
భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును.
6యథార్థవర్తనునికి నీతియే రక్షకము
భక్తిహీనత పాపులను చెరిపివేయును.
7ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు
దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.
8ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము
చేయును
దరిద్రుడు బెదరింపు మాటలు వినడు.
9నీతిమంతుల వెలుగు తేజరిల్లును
భక్తిహీనుల దీపము ఆరిపోవును.
10గర్వమువలన జగడమే పుట్టును
ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
11మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును
కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి
కొనును.
12కోరిక సఫలము కాకుండుటచేత హృదయము
నొచ్చును
సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
13ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును
ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.
14జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట
అది మరణపాశములలోనుండి విడిపించును.
15సుబుద్ధి దయను సంపాదించును
విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
16వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు
బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.
17దుష్టుడైన దూత కీడునకు లోబడును.
నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు.
18శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్యతలు
ప్రాప్తించును
గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
19ఆశ తీరుట ప్రాణమునకు తీపి
చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము.
20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.
మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
21కీడు పాపులను తరుమును
నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
22మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా
చేయును
పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
23బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా
పండును
అన్యాయమువలన నశించువారు కలరు.
24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి
కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
25నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును
భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

TODAY’S SCRIPTURE | MIGHTY WARRIOR OF GOD | AUDIO BIBLE

Let’s get back to His Word and build our lives on the promises of God and allow God to direct us each day as we hear His voice through His Word.
The main motive to start this channel is to reach out to the people who are unable to read, old age, children who find difficult in reading and the unreached due to one or the other reason.

Disclaimer: This channel does not intend to hurt any personal feelings, nor to cause any loss to anyone/publishers, No copyright intended, we all are together in the kingdom of God to help each other, and to help the lesser privileged among us, thank you for the co-operation, Our Lord will bless you abundantly for not interrupting the work of HIS Kingdom.

ALL GLORY TO OUR FATHER ALMIGHTY, LORD AND SAVIOUR JESUS CHRIST AND HOLY SPIRIT GOD.

source