సర్వోన్నతుడా Song Lyrics

సర్వోన్నతుడా
నీవే నాకు ఆశ్రయదుర్గము (2)
ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2)
ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)

నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట
నిలువలేరని యెహోషువాతో (2)
వాగ్దానము చేసినావు
వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥

నిందలపాలై నిత్య నిబంధన
నీతో చేసిన దానియేలుకు (2)
సింహాసనమిచ్చినావు
సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥

నీతి కిరీటం దర్శనముగా
దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)
విశ్వాసము కాచినావు
జయజీవితము ఇచ్చినావు (2) ॥సర్వోన్నతుడా॥

సర్వోన్నతుడా telugu christian video song


సర్వోన్నతుడా Song Lyrics