షారోను పొలములో పూసిన పుష్పమా
అగాధ లోయలో దాగిన పద్మమా (2)
ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను||
ఆనందభరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము (2)
యేసు నాథుడు నిన్ను పిలువగా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||
కొండలు దాటి బండలు దాటి
యేసు నాథుడు నిను చేరగా (2)
నీదు హృదయమున నివసింపనీయుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||