స్తోత్ర గానం చేసింది ప్రాణం Song Lyrics

స్తోత్ర గానం చేసింది ప్రాణం
క్రొత్త రాగం తీసింది హృదయం
నా యేసు ప్రేమ నా మదంతా నిండగా
ధన్యమే ఈ జీవితం
యేసుతో మరింత రమ్యమే
భూమిపై చిన్ని స్వర్గమే
యేసుతో నా ప్రయాణమే
నా తోడై నా నీడై నాతో ఉన్నాడులే ||ధన్యమే||

నా గతం విషాదం – అనంతమైన ఓ అగాధం
కోరితి సహాయం – నా యేసు చేసెనే ఆశ్చర్యం
లేనిపోని నిందలన్ని పూలదండలై మారెనే
ఇన్నినాళ్ళు లేని సంతసాలు నా వెంటనే వచ్చెనే
యేసులో నిత్యమే ||స్తోత్ర||

ఊహకే సుదూరం – నా యేసు చేసిన ప్రమాణం
నా జయం విశ్వాసం – కాదేది యేసుకు అసాధ్యం
లేనివన్ని ఉండునట్లు చేసే యేసుతో నా జీవితం
పాడలేను ఏ భాషలోనూ ఆనందమానందమే
యేసులో నిత్యమే ||స్తోత్ర||

స్తోత్ర గానం చేసింది ప్రాణం telugu christian video song


స్తోత్ర గానం చేసింది ప్రాణం Song Lyrics