స్తుతి మహిమ యేసు నీకే Song Lyrics

స్తుతి మహిమ యేసు నీకే
స్తుతి ఘనత ప్రభు నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన (8) ||స్తుతి||

కళ్ళల్లో కన్నీరు తుడిచావు
గుండె బరువును దింపావు (2)
వ్యధలో ఆదరించావు
హృదిలో నెమ్మదినిచ్చావు (2)
యెహోవా షాలోమ్ ఆరాధన (8) ||స్తుతి||

నీవొక్కడవే దేవుడవు
మిక్కిలిగా ప్రేమించావు (2)
రక్తము నాకై కార్చావు
రక్షణ భాగ్యమునిచ్చావు (2)
యెహోవా రూహీ ఆరాధన (8) ||స్తుతి||

నను బ్రతికించిన దేవుడవు
నాకు స్వస్థత నిచ్చావు (2)
నా తలను పైకెత్తావు
నీ చిత్తము నెరవేర్చావు (2)
యెహోవా రాఫా ఆరాధన (8) ||స్తుతి||

స్తుతి మహిమ యేసు నీకే telugu christian video song


స్తుతి మహిమ యేసు నీకే Song Lyrics