తూరుపు దిక్కున Song Lyrics

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు||

గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట||

చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినాడంట||

మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2) ||పుట్టినాడంట||

తూరుపు దిక్కున telugu christian video song


తూరుపు దిక్కున Song Lyrics