ఉదయమాయె హృదయమా Song Lyrics

ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే (2)
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె||

రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే (2)
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె||

తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే (2)
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె||

పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా (2)
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె||

తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని (2)
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||

ఉదయమాయె హృదయమా telugu christian video song


ఉదయమాయె హృదయమా Song Lyrics