ఉపవాసంతో ప్రార్ధనలో Song Lyrics

ఉపవాసంతో ప్రార్ధనలో
నీ వైపే చూస్తున్నా దేవా
మోకాళ్లపై కన్నీటితో
నే చేయు ప్రార్ధన వినుము దేవా
అడిగిననూ ఇయ్యవా దేవా
వెదకిననూ దొరకవా దేవా
తట్టిననూ తీయవా దేవా
యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో||

నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)
దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)
రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా(2) ||అడిగిననూ||

జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)
నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)
రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ||

ఉపవాసంతో ప్రార్ధనలో telugu christian video song


ఉపవాసంతో ప్రార్ధనలో Song Lyrics