ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక||
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ||
చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు (2)
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును(2) ||సోమరీ||
చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ||
తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును (2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2) ||సోమరీ||
ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో (2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2) ||సోమరీ||