వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది||

దావీదు పట్టణములో
బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భమునందు
బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగిపోయెను
చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి||

ఆకాశంలో ఒక దూత
పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు
దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||

వచ్చింది క్రిస్మస్ వచ్చింది telugu christian video song


వచ్చింది క్రిస్మస్ వచ్చింది Song Lyrics